రబీ ఆశలు ఆవిరి! | - | Sakshi
Sakshi News home page

రబీ ఆశలు ఆవిరి!

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

● అడుగంటుతున్న భూగర్భ జలం ● సగానికి పడిపోనున్న సాగు విస్తీర్ణం ● ఆందోళనకు గురవుతున్న రైతాంగం

ఇచ్చోడ: రబీ సాగుపై రోజురోజుకూ రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక బావులు, బోర్లు అప్పుడే అడుగంటిపోతున్నాయి. రబీలో పంటలకు సాగునీరు అందించే పరిస్థితులు దరిదాపులో కనిపించడంలేదు. దీంతో ఈ ఏడాది జిల్లాలో రబీ సాగు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు ఖరీఫ్‌లో కాకుంటే రబీలోనైనా పంటలు సాగు చేసి గండం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ నుంచి తేరుకోక ముందే రబీ సాగుకు అనువైన పరిస్థితులు కనిపించకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

శనగ సాగుపైనే అన్నదాతల ఆశలు

జిల్లా వ్యాప్తంగా మెజార్టీ రైతులు రబీలో శనగ, మొ క్కజొన్న, జొన్న సాగు చేస్తుంటారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తుండడమే ఇందుకు కారణం. జొన్న, మొక్కజొన్న పంటలకు సా గునీరు ఎక్కువ అవసరముంటుంది. శనగ పంటకు రెండు లేదా మూడు తడులు బిందు సేద్యం ద్వారా ఇస్తే పంట చేతికొస్తుంది. కానీ, శనగకు ఐదు క్వింటాళ్ల లోపే దిగుబడులు వస్తుంటాయి. పంట సాగులో చీడపీడల బెడద కూడా ఉంటుంది. కానీ, ఈ ఏ డాది అడుగంటిన భూగర్భజలాల కారణంగా జొ న్న, మొక్కజొన్న సాగు చేయడం కష్టంగా మారింది. విత్తనాలు నాటిన నుంచి పంట చేతికొచ్చేదాకా నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ రెండు పంటల కు కనీసం ఆరు నుంచి ఏడుసార్లు తడులు పె ట్టా ల్సి వస్తుంది. ఈ ఏడాది చెరువులు, బావులు, బోరు బావుల్లో ఆశించిన స్థాయిలో జలాలు లేక రబీ సాగులో లాభదాయక పంటలైన జొన్న, మొక్కజొన్న పంటలపై ప్రభావం పడనుంది. దీంతో తక్కువ నీ టితో సాగయ్యే శనగపైనే రైతుల ఆశలున్నాయి.

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని కా రణం ఒకటైతే.. జిల్లా వ్యాప్తంగా నెలరోజులుగా రో జురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లాలోని బో రజ్‌, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఇప్పటికే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరజ్‌ మండలంలో 10.6 మీటర్లు, ఇంద్రవెల్లిలో 9.52, సిరికొండ మండలంలో 8.2 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. మిగతా మండలాల్లోనూ 5 మీటర్ల లోతుకు అడుగంటాయి.

గతేడాది రబీలో సాగైన పంటల వివరాలు

జొన్న లక్ష ఎకరాలు

శనగ 60వేల ఎకరాలు

మొక్కజొన్న 30 వేల ఎకరాలు

పెసర, మినుము 4 వేల ఎకరాలు

మొత్తం 1.94 లక్షల ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement