యూత్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

ఉట్నూర్‌రూరల్‌: ఖానాపూర్‌ నియోజకవర్గంలో యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తామని యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అరకిల్ల పరమేశ్వర్‌రావ్‌ స్పష్టం చేశా రు. ఉట్నూర్‌ మండల కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఓట్లను తొలగిస్తూ నిరంకుశ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం క ల్పించిన ఓటు హక్కును అపహాస్యం చేయడం దారుణమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ యువతకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందని చెప్పారు. ఉ ట్నూర్‌, ఇంద్రవెల్లి, కడెం మండలాధ్యక్షులు రా జ్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఇమ్రాన్‌, ఉదయ్‌ రాజ్‌, అంజి, మహేశ్‌, సల్మాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement