కలిసి పని చేస్తేనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కలిసి పని చేస్తేనే అభివృద్ధి

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

● కలెక్టర్‌ రాజర్షి షా ● ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

సిరికొండ: అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. మండలంలోని సుంకిడి గ్రామపంచా యతీ పరిధి కోసుపటేల్‌ గూడ గ్రామంలో ఇంద్రవెల్లి ఘటనలో అమరుడైన పెందుర్‌ మచ్చు కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయరీతిలో కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్‌ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌తో కలిసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. మచ్చు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడారు. ఇంద్రవెల్లికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేశారని చెప్పారు. మండలంలోని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. సర్పంచ్‌ గణపతి, తహసీల్దార్‌ అరవింద్‌, ఎంపీడీవో రఘువీ ర్‌రెడ్డి, ఎంపీవో సంతోష్‌కుమార్‌, గ్రామ పటేల్‌ రా వుజీ, హౌసింగ్‌ డీఈ, ఈఈలు, కాంగ్రెస్‌ మండలా ధ్యక్షుడు కంచం లక్ష్మణ్‌, జిల్లా సార్‌మెడి పెందుర్‌ అమృత్‌రావు, నాయకులు మాధవ్‌రావు పటేల్‌, యాదవ్‌రావు, బొడ్డు దత్తాత్రి తదితరులున్నారు.

మాదపూర్‌ గ్రామ సందర్శన

ఇచ్చోడ: మండలంలోని మాదపూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌ రాజర్షిషా సందర్శించారు. పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, ప్రజలకు అందుతున్న సేవల గురించి సర్పంచ్‌ షేక్‌ ఇమ్రాన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈద్గా, శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.8లక్షల మంజూరు చేయాలని సర్పంచ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement