తీరొక్క బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

తీరొక్క బతుకమ్మ

Oct 9 2026 1:50 AM | Updated on Oct 9 2026 1:50 AM

● ప్రాంతానికో తీరుగా వేడుకలు ● నేడు బొడ్డెమ్మ పండుగ ● రేపు ఎంగిలిపూల బతుకమ్మ

ఎంగిలి పూలతో మొదలు
పూల ప్రత్యేకతలు

చెన్నూర్‌: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తలమానికమైన బతుకమ్మ పండుగను ప్రాంతాని కో తీరుగా జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాద్రపద కృష్ణ చతుర్దశి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం మహా లయ అమావాస్య కావడంతో శుక్రవారం బొడ్డెమ్మ ఆడేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. అమావాస్య రోజున ఎంగిలి పూలతో బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. బతుకమ్మ అంటే గౌరీదేవి. అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ ఆడితే శ్రేష్టమని పండితులు అభిప్రాయపడుతున్నారు. కొందరు 10న అమావాస్య శనివారం బతుకమ్మ ఆడకూడదని, 11న ఆదివారం నుంచి వేడుకలు జరపాలని చెబుతున్నారు. అయినా ఆయా ప్రాంతాల ఆచారాల ప్రకారం శనివారం ఎంగిలి పూల బతుకమ్మ ఆడేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.

రెండు పెద్ద పండుగలు

అక్టోబర్‌ నెలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు. అమావాస్య నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. రెండోది దసరా (విజయదశమి). బతుకమ్మ మాత్రం తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ.

ప్రకృతిని ఆరాధించే పండుగ

బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే పండుగ. పూలు వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా ఉండే స మయంలో ఇది వస్తుంది. భూమి, జలం, మానవ సంబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ వారం అంతా సీ్త్రలు బొడ్డెమ్మ (మట్టితో చేసిన దుర్గాదేవి బొమ్మ)ను బతుకమ్మతో పాటు నిమజ్జనం చే స్తారు.

లయబద్ధం.. ఆరోగ్య రహస్యం

బతుకమ్మలను ప్రధాన చావడిల వద్ద ఏర్పాటు చేసి ఆడుతారు. మధ్యలో బతుకమ్మ ఉంచి పాటలతో చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ లయబద్ధంగా తి రుగుతారు. తొమ్మిది రోజులు ఇలా ఆడడం ఆరోగ్యకరం. చప్పట్లు కొట్టడం, చుట్టూ తిరగడం వల్ల శరీ రంలో మార్పులు జరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో తొమ్మిది రోజులు పూర్తిగా ఆడేవారు. ఇప్పుడు సమయం లేనందున ఎంగిలి పూలతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆడుతున్నారు. కొందరు చేతులతో కాకుండా కోలాటం ఆడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పాత పద్ధతులు ప్రకృతితో పాటు ఆరోగ్యానికి, గౌరీదేవి ఆరాధనకు శ్రేష్ఠమైనవి. నేటి తరం వాటిని కొనసాగించాలని మహిళలు కోరుతున్నారు.

.బతుకమ్మ ఎంగిలి పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బొడ్డెమ్మ పండుగనాడు ‘‘బొడ్డెమ్మా బొడ్డెమ్మా వలలోం బిడ్డాలేందారే వలలో’’ అని పాడే పాట సంతానం గురించి. పూర్వం ప్రసవ సమయాల్లో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. నీటి రేవుల్లో ప్రసూతి స్థలాలు ఉండేవి. ప్రసవ సమయంలో తల్లులు పిల్లలు బతికినందుకు ప్రతీకగా తంగేడు, గనుగ పూల ముద్దలను నిమజ్జనం చేశారు. ఆ ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని ప్రతీతి. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినది. ఐదుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లిని గౌరవించేవారు. మానవ జాతి పిల్లలతోనే మనుగడ సాగుతుంది. అందుకే తల్లికి గౌరవం, అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించి పూజించేలా చేసింది. అమ్మదేవత ఆరాధన రూపమే బతుకమ్మ పండుగ అని పురాణాలు చెబుతున్నాయి.

బతుకమ్మకు వాడే తంగేడు, బీర, చామంతి, తా మర, కాకర, గుమ్మడి, దోస, గడ్డిపూలు ఒక్కొక్క టి ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయి. ఇవి ఆధ్యాత్మికతతో పాటు ఔషధ గుణాలు కూడా కలిగి ఉ ంటాయి. తంగేడు, గనుగతో పాటు గుమ్మడి, చా మంతి, బంతి, మందారం వంటి పూలను కూడా వాడుతారు. గనుగ పూలు బతుకమ్మ తయారీలో ప్రధానం. తెల్లని పూల మధ్య గడ్డి, గులాబీ, ఇతర రంగు పూలు ఉంటాయి. తొమ్మిది రోజులు పేర్చేందుకు గనుగ పూలు అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా లభిస్తాయి. ఉదయమే వెళ్లి కోసుకొస్తారు. అందుబాటులో లేనివారు మార్కెట్లలో కొనుగోలు చేస్తారు. తంగేడు పూలను అందంగా పేర్చేందుకు వాడుతారు. కొందరు వేడుకల కోసం వివిధ రకాల పూల తోటలు పెంచి మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement