ఎఫ్‌ఏపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఏపై విచారణ

Oct 9 2026 1:50 AM | Updated on Oct 9 2026 1:50 AM

బజార్‌హత్నూర్‌: మండలంలోని టెంబి గ్రామంలో వీబీజీ రాంజీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బోరకర్‌ దిగంబర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై గురువారం అడిషనల్‌ డీఆర్డీవో రాంప్రసాద్‌, విజిలెన్స్‌ అధికారి రాజేశ్వర్‌ విచారణ చేపట్టారు. ఎఫ్‌ఏ దిగంబర్‌ అవినీతిపై సెప్టెంబర్‌ 21న టెంబి గ్రామస్తులు కలెక్టర్‌ రాజర్షిషాకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ చేపట్టారు. నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సోమ రాములు, ఏపీవో శ్రీనివాస్‌, దేవన్న, దాదారావ్‌, జాదవ్‌ వెంకట్రావ్‌, జిట్టి భీము డు, జాదవ్‌ గజానంద్‌, మర్రి రాకేష్‌, జాదవ్‌ మారుతి, వానుడే శివనంద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement