బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంటర్ (ఎంపీసీ) సెకండియర్ చదువుతున్న ముడిమడుగుల హర్షిత్ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–19 జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అకిడి విజయసాగర్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ బాబురావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు.


