రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Oct 9 2026 1:50 AM | Updated on Oct 9 2026 1:50 AM

భైంసారూరల్‌: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్‌ (జి) మండలం మొత్కపల్లి గ్రామంలోని సుద్దవాగు నుంచి భైంసా మండలానికి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వానల్‌పాడ్‌ వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భైంసా తహసీల్దార్‌ శశిభూషణ్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ దత్తాత్రేయ, వానల్‌పాడ్‌, పేండ్‌పల్లి, మహాగాం జీపీవోలు లస్మన్న, కిషన్‌, ప్రసాద్‌ ట్రాక్టర్లను భైంసారూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు.

పోక్సో కేసులో

ఏడాది జైలు

నిర్మల్‌రూరల్‌: పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు గురువారం తీర్పునిచ్చినట్లు రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు. మండలంలోని ఎల్లపల్లి గ్రామానికి చెందిన బోరసు అరుణ్‌ ఏడాది క్రితం గ్రామానికి చెందిన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం, నిందితుడిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ పూర్తి చేసిన అనంతరం న్యాయస్థానం నిందితుడికి ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

దేశీదారు విక్రేత అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: దేశీదారు మద్యం విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు. జైనథ్‌ మండలం సాంగ్వి(కె) గ్రామానికి చెందిన కురే రవి మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు మద్యం తీసుకువచ్చి గ్రామంలో విక్రయిస్తుండగా బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద 180 మి.లీ. గల 67 దేశీదారు మద్యం బాటిళ్లు లభించాయని, వాటి విలువ సుమారు రూ.5,360 ఉంటుందన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేకుండా దేశీదారు రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చికిత్స పొందుతూ

ఒకరి మృతి

కుంటాల: నర్సాపూర్‌(జి) మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామానికి చెందిన జాదవ్‌ సురేందర్‌ (58) ఈనెల 6న రాత్రి కల్లూరు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా చాక్‌పల్లికి చెందిన తౌసిఫ్‌ ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement