లోకేశ్వరం: ఎల్‌నినో ప్రభావంతో రానున్న కా లంలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతాయని, సమస్యను అధిక మించేందుకు ప్రతీ ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవా లని డీపీవో, ఇన్‌చార్జి జెడ్పీ సీఈవో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కన్కపూర్, అబ్దుల్లాపూర్, జోహర్‌పూర్,ఽ ధర్మోర, గడ్‌చాంద, నగర్, కిష్టాపూర్ గ్రామాల్లోని జలసిరి, ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణంపై గురువారం అవగాహన కల్పించారు. చేయూత పింఛన్ కోసం దరఖాస్తును చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారి పరిస్థితిలను పరిశీలించారు. రైతులు నీటి కుంటలను నిర్మించుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీవో సోలమన్‌రా జ్, సర్పంచులు సునీల్, జయలలిత, దయానంద్, మామిడి సంజీవరెడ్డి, భోజన్న, కరిపే శోభరాణి, బచ్చన్న ఉన్నారు.


