ఉట్నూర్‌రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పవన్ కుమార్, టి.మున్నా, ఎం.మహేష్ (400 మీ.పరుగు), జె.శ్రీకాంత్ (కిడ్ జావెలిన్ త్రో), ఎస్.అభితేజ (60 మీ.పరుగు), ఎస్.శ్రీశాంత్ (300 మీ. పరుగు), టి.సంజీవ్ (200 మీ.పరుగు) ఆయా క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 11న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. గెలుపొందిన విద్యార్థులను ఐటీడీఏ పీవో మంద మకరందు, డీడీ ట్రైబల్ వెల్ఫేర్, స్పోర్ట్స్ ఆఫీసర్ కె.పార్థసారథి, డిప్యూటీ డీఈవో చందన్, హెచ్‌ఎం ఎ. గణేశ్, పీడీ జాదవ్ హేమంత్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.


