ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సినీనటి వైష్ణవి చైతన్య ముఖ్య అ తిథిగా హాజరై షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. వైష్ణవి చైతన్యను చూసేందుకు అభిమానులు, యువత భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. పలువురు యువత ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య షాపింగ్ మాల్‌లోని వస్త్రాలను పరిశీలించారు. వివిధ డిజైన్లు, మోడళ్లను ఆసక్తిగా తిలకించారు. ఆదిలాబాద్‌లో షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నాణ్య మైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మనీషా, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నా యకులు, వ్యాపారులు, అభిమానులు పాల్గొన్నారు.


