ఆదిలాబాద్ జిల్లాలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. మహిళల్లో 2019–21 నాటి సర్వేలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10.8శాతం ఉండగా తాజాగా 15.2శాతానికి, పురుషుల్లో గతంలో 12.0శాతం ఉండగా.. ప్రస్తుతం 20.0శాతానికి పెరిగింది. మహిళల్లో సాధికారత పెరిగింది. 84.5శాతం మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. 45.7శాతం మంది మహిళలు మొబైల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న వారిలో మహిళల సంఖ్య 59.0శాతం ఉండగా.. పురుషుల్లో కేవలం 1.1శాతం మాత్రమే ఉంది. రుతుస్రావ సమయంలో ఆరోగ్యకర పద్ధతులు అవలంబిస్తున్న వారి సంఖ్య 85.6శాతంగా సర్వేలో నమోదైంది.


