ఆదిలాబాద్: జిల్లాకు చెందిన గిరిజన హాకీ క్రీడాకారులు వెట్టి రామ్‌కుమార్, కొడప ప్రదీప్ జాతీయ స్థాయి సీనియర్ హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి తెలిపారు. ఈ నెల 10 నుంచి 22 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించనున్న పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. కోశాధికారి డేవిడ్, సంయుక్త కార్యదర్శి జాదవ్ రవీందర్, సీనియర్ క్రీడాకారులు గోవింద్, సుధీర్, శ్రీనివాస్, అశోక్ తదితరులు అభినందించారు.


