సాక్షి, మంచిర్యాలడెస్క్: కౌమార దశలోనే బాలికల పై మూడు ముళ్ల భారం పడుతోంది. ఆడుతూ పా డుతూ చదువుకోవాల్సిన వయస్సులో పిల్లల ఆలనపాలన చూడాల్సి వస్తోంది. 15నుంచి 19ఏళ్లలోపే బాలికలకు పెళ్లి, గర్భిణులు, తల్లులు అయిన వారి సంఖ్య కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.2 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 నిర్వహణకు ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఆ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. పిల్లలు, విద్య, పెళ్లి, కుటుంబ నియంత్రణ పద్ధతుల అనుసరణ, పిల్లల ఆరోగ్యం, ప్రసవాలు, మహిళల్లో ఊబకా యం, మద్యపానం, మహిళ సాధికారత తదితర 93అంశాలపై సర్వే చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అంశాలు వెల్లడయ్యాయి.
మంచిర్యాల మహిళల్లో ఊబకాయం
మంచిర్యాల జిల్లాలో ఊబకాయం బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. 36.1శాతంగా తేలింది. జీవనశైలిలో మార్పులు, జంక్‌ఫుడ్ వల్ల ఊబకాయం బారి న పడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భారం మహిళలపైనే పడుతోంది. ఆపరేషన్ చేయించకున్న మహిళల సంఖ్య 59.9శాతం ఉండగా.. పురుషుల్లో 6శాతం మాత్రమే ఉంది. ప్రై వేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరుగుతుండగా.. 92.4శాతం ఆపరేషన్లు చేస్తున్నారు. ప్ర భుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, శస్త్రచికిత్సలు 51.6 శాతంగా సర్వేలో వెల్లడైంది. మధుమేహం బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. 2019– 21 నాటి సర్వేలో 14.2శాతంగా ఉండగా.. ఈ సర్వేలో బాధితుల సంఖ్య 19.7శాతానికి పెరిగింది.
అంశం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్
కౌమార గర్భధారణ 3.8 10.2 2.4 2.5
సిజేరియన్ ప్రసవాలు 51.0 38.5 70.3 75.3
మహిళల్లో ఊబకాయం 21.8 22.3 36.1 27.7
పురుషుల్లో మధుమేహం 20.0 17.4 25.3 19.4
మద్యం తాగే పురుషులు 27.4 30.1 43.9 41.6
మహిళల్లో పొగాకు వినియోగం 14.9 12.5 6.2 8.0
ఉమ్మడి జిల్లాలో అంశాల వారీగా సర్వే వివరాలు(శాతంలో)
నిర్మల్‌లో గర్భిణులకు ఆ‘పరేషాన్’


