రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో కాంస్య పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో కాంస్య పతకాలు

Oct 7 2026 11:43 PM | Updated on Oct 7 2026 11:43 PM

ఆదిలాబాద్‌టౌన్‌: హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడా పోటీల్లో ఆదిలాబాద్‌ జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రతిభ కనబర్చి మూడు కాంస్య పతకాలు సాధించారు. గెజిటెడ్‌ అధికారుల విభాగంలో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ పోటీల్లో ఏఆర్‌ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారుల డబుల్స్‌ విభాగంలో కానిస్టేబుళ్లు జాదవ్‌ కిషోర్‌, కె.దేవ్‌రావు తృతీయస్థానంలో నిలిచి కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. విజేతలను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అభినందించి ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement