ఆదిలాబాద్‌రూరల్: ప్రజల రక్షణ, భద్రతలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ వంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. మావల పోలీస్‌స్టేషన్ పరిధి పిట్టల్‌వాడ కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 116 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు, ఒక కారుతో పాటు నంబర్ ప్లేట్ లేని, నంబర్ ప్లేట్ చెరిపివేసిన 8వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మూడు బెల్ట్ షాపుల్లో 42 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. పెండింగ్ చలాన్లు రూ.57,110 వసూలైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్‌రావు, సీఐలు ప్రేమ్ కుమార్, ప్రణయ్‌కుమార్, రహీంపాషా, బి వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి వెంకటి, టి. మురళి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
యాపలగూడలో ‘పోలీసులు మీకోసం’
ఆదిలాబాద్‌రూరల్: ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా పోలీసులు మీ కోసం కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎస్పీ అన్నారు. మండలంలోని యా పల్‌గూడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా కుమురంభీం విగ్రహానికి పూ లమాల వేసి నివాళు లర్పించారు. మండల స్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తున్న 10 మంది వాహనదారుల కు హెల్మెట్లు, గ్రామ లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆదిలా బాద్ రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై విష్ణువర్ధన్, సర్పంచ్ నిరోషా, ఉప సర్పంచ్ దత్తు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, తక్షణ రుణాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఆన్‌లై న్ పెట్టుబడుల పేరుతో సైబర్ కేటుగాళ్లు ప్రజ లను మోసం చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ ను నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మా సంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పే ర్కొన్నారు. బుధవారం జిల్లా పో లీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ నేరాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ఏఎస్సై సురేందర్, సిబ్బంది శివతో కలిసి ఆవిష్కరించారు.
గంజాయి రహిత సమాజానికి కృషి
గంజాయి రహిత సమాజానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని ఎస్పీ అన్నారు. నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలనలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ నిందితులను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. నగదు రివార్డులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.


