ఆదిలాబాద్‌టౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించాలంటే న్యాయవ్యవస్థ, పోలీసు శాఖ, వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని జిల్లా జడ్జి కె.ప్రభాకర్‌రావు అన్నారు. సమష్టి కృషితోనే నేరాలను శాసీ్త్రయంగా నిరూపించి నిందితులకు శిక్ష పడేలా చే యవచ్చన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జడ్జిలు, పోలీసు అధికారులు, ప్రభుత్వ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ నేర కేసుల దర్యాప్తులో ప్రతీ అంశాన్ని చట్టబద్ధంగా, శాసీ్త్రయంగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జడ్జిలు డ్యానీరూత్, బి.హుస్సేన్ నాయక్, ఎస్.తేజస్విని, సీహెచ్.దివ్యవాణి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు ఎస్పీ పి.మౌనిక, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు షాహిన్ సుల్తానా, రహీం, రమణారెడ్డి, సంజయ్ వైరాగరి, ప్రకాష్, ఏపీపీ నవీ న్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి పాల్గొన్నారు.


