గిరి గ్రామాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గిరి గ్రామాల అభివృద్ధికి కృషి

Jul 10 2026 5:10 AM | Updated on Jul 10 2026 5:10 AM

నార్నూర్‌: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని లోకారి(కే)లో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నప్పటికీ, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ యోగేష్‌, కుండిశేకుగూడ సర్పంచ్‌ పూసం బాదిరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement