దేవుడే దిక్కు! | - | Sakshi
Sakshi News home page

దేవుడే దిక్కు!

Jul 10 2026 5:10 AM | Updated on Jul 10 2026 5:10 AM

ప్రసూతి వార్డులో ఒకే ఒక్కరు! సెలవులో పలువురు వైద్యులు.. పీజీ విద్యార్థులు, హౌస్‌ సర్జన్లతోనే నెట్టుకొస్తున్న వైనం పత్తాలేని హెచ్‌వోడీ.. డిప్యూటేషన్‌లో మరో వైద్యురాలు అస్తవ్యస్తంగా రిమ్స్‌ గైనిక్‌ విభాగం

ఆదిలాబాద్‌టౌన్‌:గర్భిణులకు ప్రసవం అనేది పునర్జన్మ లాంటిది.. తల్లి, శిశువు ప్రాణాలకు సంబంధించిన ఈ సమయంలో వైద్యసేవలు అత్యున్నత స్థా యిలో ఉండాల్సి ఉన్నప్పటికీ, ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో గర్భిణులు ప్రసవంకోసం ఈ ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు. కానీ వార్డులో వైద్యుల కొరత కారణంగా సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా సీని యర్‌ వైద్యులు అందుబాటులో లేక, పీజీ విద్యార్థులు, హౌస్‌ సర్జన్లతోనే సేవలు కొనసాగుతుండటంపై గర్భిణులు, బాలింతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

అందుబాటులో ఉండని వైద్యులు..

కొన్ని రోజులుగా రిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రసూతి వా ర్డులో సాధారణ వైద్యసేవలు సైతం సక్రమంగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప లువురు సీనియర్‌ వైద్యులు సెలవుల్లో ఉండగా, వా ర్డు నిర్వహణ మొత్తం హౌస్‌ సర్జన్‌లు, పీజీ విద్యార్థులపైనే ఆధారపడిన దుస్థితి నెలకొంది. క్లిష్టమైన కేసుల్లో నిర్ణయాలు తీసుకునే సీనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రసూతి విభాగానికి సంబంధించిన రెగ్యులర్‌ హెచ్‌ఓడీ పత్తా లేకుండాపోగా ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌ ఇచ్చారు. అసలే వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుండగా, ఆమెకు డిప్యూటేషన్‌ ఇవ్వడంపై అసహనం వ్యక్తమవుతోంది. గర్భిణులు, బాలింతల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ వార్డు తీరే అంతా..

గైనిక్‌ విభాగానికి సంబంధించి ఇద్దరు హెచ్‌ఓడీలు ఉండగా, ఇందులో ఒకరు రెగ్యులర్‌, మరొకరు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ హెచ్‌ఓడీ నియామకమైనప్పటి నుంచి విధులకు హాజరు కా వడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటి కీ ఆమెకు నెలనెలా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు సెలవులు పెట్టారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆరుగురు ఉండగా, ప్రస్తుతం ఒ క్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమెకు పని భారం పెరిగిపోయింది. ఒకరోజు విధులు నిర్వహి స్తే మరుసటి రోజు విశ్రాంతి ఉంటుంది. ఇద్దరు వై ద్యులు మెటర్నిటి లీవ్‌పై వెళ్లారు. నిర్మల్‌ నుంచి రె గ్యులర్‌ వైద్యురాలిని కేటాయించగా, ఆమె విధుల్లో చేరి సెలవుపై వెళ్లారు. ఓ వైద్యురాలు ఎనిమిది నెల ల ఉంచి విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల ఓ వైద్యురాలు నిర్మల్‌కు బదిలీపై వెళ్లింది. దీంతో గై నిక్‌ విభాగం మొత్తం అస్తవ్యస్తంగామారడంతో అ త్యవసరపరిస్థితుల్లో దేవుడిపైనే భారం వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement