కోడిపందేలకు దూరంగా ఉండండి
ఎటపాక: సంక్రాంతి పండగల నేపథ్యంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ హెచ్చరించారు. ఆదివారం ఎటపాకలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో కోడి పందేలు, పేకాట, తదితర బెట్టింగులు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. డివిజన్ వ్యాప్తంగా జూద క్రీడలను అరికట్టడంలో భాగంగా ముందస్తుగా 24 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. జూదాలపై నిత్యం డ్రోన్ కెమేరాలతో నిఘా ఏర్పాటు పెట్టామని చెప్పారు. సమావేశంలో సీఐ కన్నపరాజు, ఎస్సై అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు
చింతూరు: సంక్రాంతి పండగల నేపథ్యంలో పొ రుగు రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చింతూ రు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ విజయలక్ష్మి ఆదివారం హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే డివిజన్లోని అన్ని ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో తమ సిబ్బంది తనిఖీలు, సోదాలు కొనసాగుతున్నాయని ఆమె అన్నారు. బస్సులు, టూరిస్ట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తున్నామన్నారు.
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ల
నియామకం
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ కోర్టుల్లో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కాల ఎస్‌వీవీఎస్‌ఎన్ శేషారావు (కాకినాడ–1), ఇంటి సర్వారాయుడు (కాకినాడ–2), చింత నాగేంద్రరావు (కాకినాడ–3), బి.విజయ భారతి (పిఠాపురం), కె.శారదమణి (ప్రత్తిపాడు), సీహెచ్ కృష్ణారావు (తుని) నియమితులయ్యారు.


