జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య

Dec 5 2025 6:39 AM | Updated on Dec 5 2025 6:39 AM

జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య

జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య

లక్ష్మణచాంద: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు సోన్‌ మండలంలోని గంజాల్‌ గ్రామానికి చెందిన బందెల రవి (38) అప్పుల బాధతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3న గ్రామ సమీపంలోని తన పొలంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు 108లో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

అనారోగ్యంతో వృద్ధురాలు..

కుభీర్‌: అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దొడర్నా తండాకు చెందిన జాదవ్‌ రేణబాయి (70) వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు భరించలేక బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు జాదవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

లక్ష్మణచాంద: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన సంఘటన సోన్‌ మండలంలోని గంజాల్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఓ మహిళ గురువారం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంజాల్‌ గ్రామానికి చెందిన నేల లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు..

ఉట్నూర్‌రూరల్‌: ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందుతాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంగన్నపేటకు చెందిన జాడి లక్ష్మీనారాయణ (17) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి నిరాకరించడంతో గత నెల 7న పురుగుల మందు తాగాడు. విషయం స్నేహితులతో చెప్పడంతో ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement