అమ్మా.. మేం గుర్తురాలేదా?
అమాయకంగా ఈ మహిళ ఒడిలో కూర్చున్న చిన్నారులను చూస్తే ముద్దొస్తున్నారు. కానీ వాళ్లు ఇప్పుడు తల్లి శవం పక్కన కూర్చున్నారు. నిన్నటి వరకు అమ్మతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడారు. రాత్రి అమ్మను హత్తుకుని నిద్రపోయారు. అమ్మ చేతి గోరుముద్దలు తిన్నారు. తెల్లారి విగత జీవిగా మారిన తల్లి మృతదేహం పక్కన కూర్చున్నారు. అమ్మకు ఏమైందో తెలియక అమాయకపు చూపులతో అందరికీ కన్నీరు తెప్పించారు. అమ్మ చేతి గోరు ముద్ద ఇక తినమని రెండేళ్ల కూతురుకు తెలియదు.. అమ్మ పాలు తాగలేనని ఆరు నెలల బాబుకు తెలియదు.. ఉరేసుకునే సమయంలో మేం గుర్తుకు రాలేదా అమ్మ.. అన్నట్లు మౌనంగా తల్లి మృతదేహం చూస్తూ ఉన్నారు.


