108, 102 ఉద్యోగులకు శిక్షణ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన 108, 102 ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధికారి గజేందర్, 108, 102 వాహనాల సాంకేతిక అధికారి లింగాచారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్‌ఎస్), సీపీఆర్‌లతో పాటు, సుఖ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనబర్చిన కాసిపేట పైలట్ జె.కొమురయ్యకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్, కొండలరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


