‘తెల్ల’బోతున్నారు!
పత్తి రైతులను కష్టాలు వీడడంలేదు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక విత్తనా లు మొలకెత్తలేదు. మళ్లీ మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. తర్వాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉంది. దీంతో రైతులు సంతోషపడ్డారు. కానీ సెప్టెంబర్ చివరివారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు పూత, కాయలు రాలిపోయాయి. చివరకు మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో దిగుబడి సగానికి పడిపోయింది. ఇక వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు కూడా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం నాణ్యత లేదని సీసీఐ మద్దతు ధర తగ్గించింది. మరోవైపు ఎకరాకు 12 క్వింటా ళ్లకు మించి కొనబోమని నిబంధన విధించింది. దీంతో కాస్త బాగా దిగుబడి వచ్చిన రైతులు ఇప్పుడు తెల్ల బంగారాన్ని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. మరోవైపు చేలల్లో ఉన్న పత్తిని ఏరేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
‘తెల్ల’బోతున్నారు!
‘తెల్ల’బోతున్నారు!
‘తెల్ల’బోతున్నారు!


