అక్కడందరూ బంధువులే..
వాంకిడి: మండలంలోని ఖమాన గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం ఐదుగురు బరిలో నిలువగా అందులో నలుగురు దగ్గరి బంధువులే ఉండడం గమనార్హం. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పెందూర్ ప్రకాష్ ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్ రావడంతో తన కూతురు అంకితను బరిలో నిలిపాడు. ప్రకాష్‌కు కుమారుడి వరుసైన పెందూర్ శ్రీనివాస్ గతంలో పలుమార్లు సర్పంచ్ పదవికి పోటీ చేయగా ఈసారి అతని భార్య రుక్మిణిని బరిలో నిలిపాడు. ఈసారి అంకిత, రుక్మిణితో పాటు వారికి సమీప బంధువులైన పెందూర్ నంద, గేడం సునీత సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గేడం సునీతకు పెందూర్ అంకిత కూతురు వరుస అవుతుంది. పెందూర్ రుక్మిణికి పెందూర్ నంద అత్త వరుస అవుతుంది.
అక్కడందరూ బంధువులే..
అక్కడందరూ బంధువులే..
అక్కడందరూ బంధువులే..
అక్కడందరూ బంధువులే..


