విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలెరో
భైంసాటౌన్: బొలెరో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన పట్టణంలోని సేవాలాల్ చౌక్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన మాజిద్ గురువారం తన బొలెరోలో ఓ రైతుకు చెందిన పత్తి భైంసాలో విక్రయానికి తెచ్చి తిరిగి వెళ్తుండగా, సేవాలాల్ చౌక్ వద్దకు రాగానే డ్రైవర్‌కు మూర్చ రావడంతో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో స్తంభం విరిగి వాహనంపై పడగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మాజిద్‌తోపాటు అక్కడే నిల్చుని ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


