మీ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడాలి
ఒంగోలు సబర్బన్: నేటి యువత ఆలోచనలు, మేధోసంపత్తి సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రిపుల్ ఐటీ, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో గురువారం నిర్వహించిన ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డీవీఆర్ మూర్తి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రవితేజ, సీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వరరావు, ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలు మెట్రో: అపర చాణిక్యుడిగా పేరు పొందిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య మన జిల్లా ప్రకాశం జిల్లా వాసి కావడం మన అదృష్టవని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద గల ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యాలయం, వాసవీ భవన్‌లో కొణిజేటి రోశయ్య నాలుగో వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి పేరు తెచ్చారని కొనియాడారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొని రోశయ్య విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసిరావు, మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మువ్వల శ్రీనివాసులు, కొల్లిపర్ల సురేష్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడు తాతా గుప్తా, జలదంకి కృష్ణారావు, శ్రీనివాసరావు, దుడ్డు రంగనాయకులు జెమినీ నాగేశ్వరరావు, అచ్యుత సత్యం తదితరులు పాల్గొన్నారు.
మీ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడాలి


