పుల్లారెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ
ఒంగోలు సిటీ: మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లెర్ల పుల్లారెడ్డి ఇటీవల మృతి చెందారు. మృతుడు పల్లెర్ల పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఒంగోలు నగరాధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.


