పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు
ఒంగోలు సిటీ: పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం టెలిఫోన్ అడ్వైజరీ కమిటీలో మెంబర్‌లుగా స్థానం కల్పించినందుకు దామరాజు క్రాంతికుమార్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి మర్యాద పూర్వకంగా సుబ్బారెడ్డిని కలిసి శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రస్తుతం పార్టీకి అండగా ఉండి పనిచేస్తున్న ప్రతి నాయకుడునీ, ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌లో మాజీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని తెలిపారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబుని దామరాజు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, 45వ డివిజన్ అధ్యక్షుడు పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, 44వ డివిజన్ అధ్యక్షుడు మల్యాద్రి రెడ్డి, ఉండెల వెంకటేశ్వర రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పుస్తకాన్ని చుండూరి రవిబాబు తయారు చేసి అందజేశారు.
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు


