ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..! | - | Sakshi
Sakshi News home page

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

ప్రచా

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!

కోల్డ్‌ స్టోరేజీల్లో

మూలుగుతున్న మిర్చి..

చీమకుర్తి:

త ప్రభుత్వంలో రాజులా బతికిన రైతన్న చంద్రబాబు ప్రభుత్వంలో ధీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రైతులకు అన్నీ ఇబ్బందులే. వ్యవసాయం అంటే ముందు నుంచి చిన్నచూపే. వ్యవసాయం దండగా అని చెప్పిన ఏకై క నాయకుడు ఆయన అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరియా వాడొద్దు క్యాన్సర్‌ వస్తుందంటారు ? తినే వారు లేరు వరి సాగు ఎందుకంటారు ? పొగాకు వద్దు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని పిలుపునిస్తారు. నల్లబర్లీ పొగాకు బ్యాన్‌ పెట్టాం దాని జోలికి వెళ్లొద్దంటారు ? ఇదీ చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన గత 18 నెలల కాలంలో రైతులకు చేసిన మేలు. ఇలాంటి తరుణంలో రైతుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని గమనించి నవంబర్‌ 25 నుంచి 30వ తేదీవరకు రైతన్న మీకోసం పేరుతో కార్యక్రమం చేప్పటారు. ఈ కార్యక్రమం ప్రచారం కోసం తప్ప రైతులకు ఒరిగిందేమి లేదని రైతులు బాహాటంగానే ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నీటిలభ్యత ఆధార పంటలు, విలువ ఆధారిత పంటలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ, ప్రభుత్వ సేవల యాప్‌ల ద్వారా వ్యవసాయ సమాచారం తెలుసుకోవాలనే 5 రకాల అంశాలతో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని రైతులు విమర్శలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ కార్యమంపై అంతగా ఆసక్తి చూపలేదని పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. అందుకేనేమో అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనటానికి పెద్దగా ఉత్సాహం, ఆసక్తి చూపించలేదు. ఏదో వ్యవసాయ అధికారులను అడ్డంపెట్టుకొని స్థానిక అనుకూల రైతులతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రజల్లో పరువుపోకుండా చల్లగా లాక్కొచ్చారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మార్కెట్‌ యార్డులు ఉన్నా వృథానే..

నియోజకవర్గ పరిధిలో మద్దిపాడు మార్కెట్‌ యార్డు ద్వారా ఇప్పటి వరకు ఒక్క పంట ఉత్పత్తికి కొనుగోలు చేయటం, మద్దతు ధరను అందించడం వంటి పనులు చేసిన పాపాన పోలేదని యార్డు కార్యాలయంలోని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ఎక్కువుగా రైతులు పొగాకు, శనగ, మొక్కజొన్న, వరి, కంది, మిర్చి వంటి ప్రధాన పంటలను సాగు చేశారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమిలో దాదాపు 60 వేల మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పేపర్‌ మీద ప్రకటనల జోరు తప్ప ఆర్థిక మద్దతు చేకూర్చింది లేదని వాపోతున్నారు.

అరుగుల వద్దకు వచ్చి .. ఫొటోలకు పోజులిచ్చి

సంతనూతలపాడు: వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటి వద్దకు వెళ్లి సమాచారం సేకరించి యాప్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఉద్దేశించిన రైతన్నా మీ కోసం కార్యక్రమం ఫొటోలకే పరిమితమైందని వాదనలు వినిపిస్తున్నాయి. మండలానికి చెందిన అధికారులు, టీడీపీ నేతలు, వారికి అనుకూలంగా ఉన్న కొందరు రైతులకు పోస్టర్లు ఇచ్చి ఫొటోలు తీసుకున్నారు. ప్రజలు కూర్చునే అరుగుల వద్దకు కొందరు రైతులను ఆహ్వానించి పోస్టర్లు ఆవిష్కరించి ఫొటోలతో సరిపెట్టారు.

పూర్తిగా నష్టపోయిన శనగ రైతు..

మద్దిపాడు: మండలంలో ప్రధానంగా శనగ, పొగాకు పంటలను పండిస్తారు. ఈఏడాది ఖీరీఫ్‌లో 4 వేలకు మించలేదు. పొగాకు రైతుల పరిస్థితి మాత్రం ధీనంగా ఉంది. వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను నాణ్యత పేరుతో కొనుగోలు చేయకపోవడంతో తిరిగి పంపారు. ప్రతిరోజు వందల బేళ్లను తిరస్కరణ పేరుతో పొగాకు రైతు పొట్టగొట్టారు. దళారులు, పొగాకు వేలం కేంద్రం అధికారులు, ప్రభుత్వం వలన రైతన్నలు పూర్తిగా అప్పులపాలయ్యారు.

పరిహారం ఇవ్వకకుండా.. పరిహాసం

చీమకుర్తి రూరల్‌: మండలంలో మోంథా తుపాన్‌ ప్రభావంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. వరి 70 ఎకరాలు, మొక్కజొన్న 175 ఎకరాలు, మినుము 4 ఎకరాలు, సజ్జ 5 ఎకరాలు, లేత పంటలు వరి 350, మొక్కజొన్న 150 ఎకరాలలో రైతులు నష్టపోయారు. వరికి మద్దతు ధర ఏ రకం రూ.2389, బీ రకం రూ. 2369 ప్రకటించారు. కానీ తీరా చూస్తే కొనే నాథుడు లేకపోవడంతో రైతులు రూ.1200 అమ్ముకున్నారు.

రైతుల్లో భ్రమ కల్పించేందుకు

చంద్రబాబు సర్కార్‌ అపసోపాలు

రైతన్న మీకోసం అంటూ సర్కార్‌

మరో మోసం

చంద్రబాబు సర్కార్‌లో కనిపించని మద్దతు ధర

కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు

నాలుగులుప్పలపాడు: మండలంలో ముఖ్యంగా బర్లీ పొగాకు సాగు చేస్తే నేటికీ రైతుల ఇళ్లల్లో నిల్వలు అలానే ఉన్నాయి. మిర్చి పంటకు రూ.12300 మద్దతు ధర అని చెప్పినా ఆచరణలో అది ఏమాత్రం సాధ్యం కాకపోవడంతో నేటికీ కోల్డు స్టోరేజీల్లో తమ పంటలను నిల్వ చేసుకున్నారు. మరికొంత మంది రైతులు సాగు కోసం నష్టాలకు అమ్మాల్సి వచ్చింది. సబ్సిడీపై రైతులకు శనగలు ఇస్తామని మోసం చేసింది. ప్రభుత్వం అమ్మే ధర కన్నా దళారుల వద్దే తక్కువ రేటుకు శనగలు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నా మీ కోసంలో స్థానిక ఎమ్మెల్యేను పాల్గొనమని చెప్పినా ఏ ఒక్క గ్రామంలో కూడా ఎమ్మెల్యే పాల్గొనలేదు. ఇక్కడే అర్థమవుతోంది చంద్రబాబు సర్కార్‌కు రైతంటే ఎంత అలుసోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..! 1
1/3

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..! 2
2/3

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..! 3
3/3

ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement