స్.. గజగజ
సింగిల్ డిజిట్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు బజార్‌హత్నూర్‌లో 8.4 డిగ్రీలుగా నమోదు చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు
కై లాస్‌నగర్: జిల్లాపై చలి పంజా విసురుతోంది. శీతల గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనం గజగజ వణుకుతున్నా రు. ఆదివారం జిల్లాలోని పలు మండలాల్లో సింగిల్ డిజిట్‌గా నమోదయ్యాయి. ఉదయం పది దాటితే తప్ప బయటకు రాలేని పరిస్థితి ఉండగా సాయంత్రం 5గంటల నుంచే చలిగాలుల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పల్లెలను మంచు దుప్పటి కప్పేస్తోంది. ప్రజలు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మరో వైపు చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేకువజామున పాలవ్యాపారులు, పేపర్‌బాయ్స్, కూరగాయల విక్రేతలు, మున్సిపల్ స్వచ్ఛ కా ర్మికులు వణుకుతూనే తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. పొగమంచు కారణంగా ఉదయం వేళలోనూ లైట్లు వేసుకుని నడపాల్సి వాహనదారులు పేర్కొంటున్నారు. రానున్న నాలుగు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పా టిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూ చిస్తున్నారు. చలితీవ్రత పెరగడంతో ఉన్ని వస్త్రాలకు డిమాండ్ ఏర్పడింది. జిల్లా కేంద్రంలో వెలి సిన విక్రయ కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి.
బజార్‌హత్నూర్‌లో అత్యల్పం..
జిల్లాలో ఆదివారం బజార్‌హత్నూర్‌లో 8.4డిగ్రీ ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బోథ్‌లో 9.0, సాత్నాల, నేరడిగొండలో 9.5, సొనాలలో 9.6, ఆదిలాబాద్ రూరల్‌లో 9.8, భీంపూర్‌లో 9.9, ఆదిలాబాద్‌అర్బన్‌లో 10.1, తలమడుగులో 10.3, మావలలో 10.4, తలమడుగులో 10.7, తాంసిలో 10.8, గుడిహత్నూర్‌లో 11.3, ఇంద్రవెల్లిలో11.4, సిరికొండలో11.6,ఇచ్చోడ,ఉట్నూ ర్‌లో 12.4, బేలలో12.6, గాదిగూడలో 12.9, నార్నూర్ 13.2, భోరజ్, జైనథ్ మండలాల్లో 14.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.


