పుస్తక పఠనం అలవర్చుకోవాలి
ఆదిలాబాద్: ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తక పఠనంతో ఎన్నో నూతన విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో ఎంతో మంది కవులు, రచయితలు జిల్లా సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఇందులో 150 వరకు కవులు, పాఠకులు పాల్గొనడం శుభపరిణామని అన్నారు. కార్యక్రమంలో వసంత్‌రావు దేశ్‌పాండే, చిందం ఆశన్న, బి.మురళీధర్, బాబన్న, ఉదారి నారాయణ, గుంజాల రమేశ్, లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


