మిల్లులు మూసుకోవాల్సిన పరిస్థితి
సీసీఐ అమలు చేస్తున్న ఎల్1, ఎల్2, ఎల్ 3 నిబంధన కారణంగా జిన్నింగ్ మిల్లులన్నింటికీ పత్తి రాని పరిస్థితి. ఆదిలాబాద్ పట్టణంలో 19 జిన్నింగ్ మిల్లులున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమై ఇన్ని రో జులవుతున్నా ఇప్పటి వరకు తొమ్మిది మిల్లులకు పత్తి రానే లేదు. దీంతో కూలీలు, ఇతరత్రా ఖర్చులు మీదపడి మిల్లులను మూసుకోవాల్సిన పరిస్థితి నెల కొంది. ఈ నిబంధనను సడలించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. విధిలేని పరిస్థితుల్లో కొనుగోళ్లను బంద్ చేశాం. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప వెనక్కి తగ్గేదిలేదు. – రాజు చింతవార్, పత్తి వ్యాపారి, ఆదిలాబాద్


