● మైనర్‌ మ్యారేజీల నియంత్రణకు చర్యలు ● ‘బాల్య వివాహాల ముక్త్‌ భారత్‌’తో అడ్డుకట్ట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ● ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

● మైనర్‌ మ్యారేజీల నియంత్రణకు చర్యలు ● ‘బాల్య వివాహాల ముక్త్‌ భారత్‌’తో అడ్డుకట్ట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ● ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం

Jul 30 2025 8:32 AM | Updated on Jul 30 2025 8:32 AM

● మైనర్‌ మ్యారేజీల నియంత్రణకు చర్యలు ● ‘బాల్య వివాహాల మ

● మైనర్‌ మ్యారేజీల నియంత్రణకు చర్యలు ● ‘బాల్య వివాహాల మ

ఆసిఫాబాద్‌: జిల్లాలో తరచూ బాల్యవివాహాలు జ రుగుతున్నాయి. నియంత్రణకు ప్రభుత్వం పలు అ వగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం కానరావడంలేదు. నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటుత నం, ఆడ పిల్లలకు అభద్రత భావం, పేదరికం, సా మాజిక దురాచారాలు, కట్టుబాట్ల కారణంగానే బా ల్య వివాహాలు కొనసాగుతున్నాయి. వీటి నియంత్ర ణకు కేంద్ర ప్రభుత్వం ఓ కార్యాచరణ రూపొందించింది. 2030 నాటికి బాల్యవివాహాల ముక్త్‌ భారత్‌ లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్‌తోపాటు ఖమ్మం, భూపాల్‌పెల్లి జిల్లాలను ఎంపిక చేసింది.

ఏడేళ్లలో 153 వివాహాల అడ్డగింత

బాల్యవివాహాల నియంత్రణలో భాగంగా తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పురుషుడి వివాహ వయస్సు 21, స్రీల వివాహ వయ స్సు 18 ఏళ్లు తప్పనిసరి. బాల్య వివాహాలపై తర చూ జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రజల్లో మార్పు రావడంలే దు. ఏటా జిల్లాలో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ముందస్తు సమాచారం అందుకుంటున్న జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పలు వివాహాలు అడ్డుకున్నారు. గత ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 153 బాల్య వివాహాలను అడ్డుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ప్రత్యేక హబ్‌లుగా..

జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్న పది గ్రామాలను ఎంపిక చేసి ప్రత్యేక హబ్‌లుగా తీర్చిదిద్దనున్నారు. బాల్యవివాహాలతో కలిగే అనర్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తద్వారా వీటిని బాల్య వివాహ రహిత గ్రామాలుగా మారుస్తారు. ప్రతీనెల పాఠశాలల్లో డ్రాపౌట్లు, సుదీర్ఘకాలం గైర్హాజరైన బాలికలను గుర్తించి ఆ జాబితాలను అంగన్‌వాడీ టీచర్‌ జిల్లా బాలల సంరక్షణ యూనిట్లకు పంపిస్తారు. గైర్హాజరుకు కారణాలపై విచారణ జరిపిస్తారు.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో బాల్యవివాహా లను జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌, ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌, గుండి, రెబ్బెన మండలం నారాయణపూర్‌, వంకులం, పర్శనంబాల, వాంకిడి మండలం ఇందాని, పెంచికల్‌పేట్‌ మండలం చెడ్వాయి, బారెగూడ, బెజ్జూర్‌ మండలం నాగుల్‌వాయి, బాబాసాగర్‌, కర్జెల్లి, కాగజ్‌నగర్‌ మండలం బట్టుపెల్లి, చింతగూడ, దహెగాం, చీలపెల్లి గ్రామాల్లో బాల్యవివాహాలను అడ్డుకున్నారు. అధికారుల మాటను నిర్లక్ష్యం చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

జిల్లాలో అధికారులు అడ్డుకున్న

బాల్య వివాహాల వివరాలు

సంవత్సరం అడ్డుకున్న కేసులు

2019 38

2020 29

2021 24

2022 23

2023 18

2024 15

2025 06

మొత్తం 153

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement