
నకిలీ ఆయుర్వేదిక్ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: నకిలీ ఆయుర్వేదిక్ వైద్యంతో మో సగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చే యగా ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్ర ధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు. ఆరు ద్విచక్రవాహనాలు, 15 ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న మరో రూ.23వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆది లాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మందుల దుకాణం పేరిట కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, సూపర్ మార్కెట్‌ల వద్ద అనారోగ్యంతో కని పించిన బాధితుల వివరాలు సేకరిస్తారు. ఇదే సమస్య ఉన్న తమ కుటుంబీకులను ఆయుర్వేద బాబాకు చూపిస్తే నయమైనట్లు నమ్మిస్తారు. వారి సెల్ నంబర్ సేకరించి ప్రధాన నిందితుడు కుమార్ బాబాకు ఇస్తారు. బాబా సాయంత్రం వారికి ఫోన్ చేసి సమస్యకు తన వద్ద పరిష్కారం ఉందని నమ్మిస్తాడు. ముఠాలోని ఓ సభ్యుడిని వారింటికి పంపించి వారిని ఆయుర్వేద దుకాణానికి రప్పిస్తాడు. 5 గ్రాములు, 10 గ్రాముల నకిలీ మూలికలు ఇచ్చి రూ.5వేల నుంచి రూ.10వేల చొప్పున వసూలు చే స్తాడు. జిల్లా పోలీసులు వారి అక్రమాలను బట్టబయలు చేశారు. వీరిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో–6, టూటౌన్‌లో–1, మావల పోలీస్‌స్టేషన్‌లో–2 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్లో కర్ణాటకు చెందిన కుమార్ పరారీలో ఉండగా, గాజీపూర్ కు చెందిన శేఖర్ రెడ్‌లైన్, ఉగర్‌ఖర్ద్‌కు చెందిన పెంద్రేకుమార్, దరావడ్‌కు చెందిన గోలార్ సంతోష్, గుల్బర్గాకు చెందిన కొడంగల్ అమ్రేశ్, ఉబ్లికి చెందిన గోలార్ ఆనంద్, గోగక్‌కు చెందిన యలిగర్ హ జ్రత్, గుల్బర్గాకు చెందిన నగేశ్, అనిల్‌కుమార్ ఉన్న ట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఒకరి నుంచి రూ.7లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజలు గు ర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే వై ద్యం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్, మావల సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు, స్వామి ఉన్నారు.
ఎనిమిదిమంది నిందితుల అరెస్ట్
ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం
15 సెల్‌ఫోన్లు, మందులు కూడా..
వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

నకిలీ ఆయుర్వేదిక్ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్