
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
● కలెక్టర్ రాజర్షి షా
బోథ్: రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్, సొనాల, నేరడిగొండ మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌తో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులందరికీ కార్డులు అందజేస్తామన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు పరచాలి
ఇచ్చోడ: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో ఇచ్చోడ, సిరికొండ మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రాజకీయలతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలుపరచాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యవతి కోటేశ్, వైస్ చైర్మన్ చౌహాన్ శేషారావు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి, ఇచ్చోడ, సిరికొండ తహసీల్దార్లు సత్యనారాయణరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.