
‘వీపీవో’ అమలు పర్చాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు అధి కారులు గ్రామాలను సందర్శి స్తూ వీపీవో విధానం పకడ్బందీ గా అమలు చేయాలని ఎస్పీ అ ఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో మరింత గస్తీ చేపట్టాలని, నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంకెన్‌డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టాలని సూ చించారు. పోలీసులు మీకోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. స్టేషన్లలో వర్టి కల్ విధానాన్ని పూర్తిగా అమలుపర్చాలన్నారు. ఫిర్యాదుదారులపై మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్న గణపతి ఉత్సవాలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల కోసం సంసిద్ధులుగా ఉండాలని ఆదేశించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో నమోదైన కేసుల స్థితిగతులపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, నాగేందర్, ఇంద్రవర్ధన్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.