
12 టీఎంసీలకు చేరువలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రా జెక్ట్ 12 టీఎంసీల నీటి మట్టానికి చేరువలో ఉంది. ఐదురోజుల్లోనే ఏకంగా ఐదు టీఎంసీల నీ టిమట్టం పెరిగింది. మంగళవారం మంచిర్యా ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలిలా ఉన్నాయి. 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా, 144 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు 11.500 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 440 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 319 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరులుతోంది.