
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
కుభీర్: మండలంలోని రంజని గ్రామానికి చెందిన జాదవ్ సచిన్ (24) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ మంగళవారం మద్యం తాగి ఇంటికి రాగా కుటుంబీకులు మందలించారు. దీంతో తాగిన మైకంలో సచిన్ తన వ్యవసాయ చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నాన్న శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వాటోలిలో ఉరేసుకుని ఒకరు..
భైంసారూరల్: మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బాదోళ్ల మహేశ్ (31) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్, స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మహేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉంది.
జంగుగూడలో మరొకరు..
పెంబి: మద్యం తాగవద్దని భార్య మందలించినందుకు మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని షెట్‌పల్లి పరిధి జంగుగూడ గ్రామానికి చెందిన మోస్రం కృష్ణ (31) మ ద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా తరచూ భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగవద్దని భార్య గీత మందలించగా మనస్తాపానికి గురై సోమవారం రా త్రి 11గంటలకు పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి త రలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలి పారు. భార్య గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు
కెరమెరి(ఆసిఫా బాద్): ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవుడ్‌పల్లికి చెందిన జాడి నానాజీ– విమలాబాయి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లున్నారు. వీరిలో చిన్నవాడు నవీన్ (24) ఉన్నత చదువులు చదివాడు. ఇటీవల డీఎ స్సీ, ఇతర పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. దీంతో రోజూ బెంగపడుతుండేవాడు. ఈక్రమంలో సోమవారం ఇంటినుంచి బయటకువెళ్లిన నవీన్ సాయంత్రమైనా తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబీకులు వెతకగా సమీపంలోని ఓ చెట్టు కింద శవమై కనిపించాడు. అయితే అతడు చెట్టుకు ఉరేసుకోగా తాడు తెగి బండరాళ్లపై పడ్డట్లు ఆనవాళ్లున్నాయని మృతుడి తండ్రి నానాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య