
శాంతిఖని గనిలోకి దిగిన డీఎంఎస్
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ గనిని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మై న్స్ సేప్టీ (డీఎంఎస్) ఎన్.నాగేశ్వరరావు సందర్శించారు. గనిలో దిగి పని స్థలాలు, రక్షణ చ ర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూ చించారు. బొగ్గు ఉత్పత్తి యాగంలో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ దేవేందర్, శాంతిఖని గ్రూప్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, బాలాజీ భగవంత్ ఝా, గని మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హా, రక్షణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.