
ప్లీజ్.. హెల్ప్ మీ
ఆంగ్లంలో గోడు వెల్లబోసుకున్న వృద్ధుడు
పంచె కట్టు.. తలపాగా.. చేతిలో గొడుగు.. కర్ర సాయంతో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు తన ఆంగ్ల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నార్నూర్ మండలం తడిహత్నూర్‌కు చెందిన కాంబ్లే విశ్వనాథ్ తన సమస్యపై సోమవారం కలెక్టర్ రాజర్షి షాకు దరఖాస్తు అందజేశాడు. అయితే తన గోడు ఆంగ్లంలో ధారాళంగా చెప్పడాన్ని చూసిన అధికారులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 82 ఏళ్ల వయస్సు కలిగిన తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపిన ఆయన ‘ప్లీజ్.. హెల్ప్ మీ’ అంటూ కోరాడు. సమస్యను ఆలకించిన కలెక్టర్ ఎంపీడీవోను కలువాలని సూచించారు. కాగా, తాను 1964లో డిగ్రీ పూర్తి చేసినట్లు వృద్ధుడు తెలిపాడు. – కై లాస్‌నగర్