
ఉపాధ్యాయుడు లేక మూత‘బడి’!
ఇంద్రవెల్లి: మండలంలోని వడగామ్ టీడబ్ల్యూ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో వారం రోజులుగా పాఠశాల ఇలా మూతబడి దర్శనమిస్తోంది. ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో డిప్యూటేషన్‌పై మరొకరిని నియమించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎస్‌సీఆర్‌పీ పెందోర్ అర్జున్‌ను వివరణ కోరగా.. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్న విషయం వాస్తవమే అని తెలిపారు. వెంటనే డిప్యూటేషన్‌పై మరొకరిని నియమించి పాఠశాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.