
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నా రు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సో మవారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమన్నారు. డీవైఎస్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో వి జేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాస్థా యి అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను హన్మకొండ వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చే స్తామని వివరించారు. ఇందులో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, అసోసియేషన్ కోశాధికారి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.