
బారులు తీరి.. గోడు విన్నవించి
● ‘ప్రజావాణి’కి 114 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కై లాస్‌నగర్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 114 అర్జీలు అందాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..