
ఆ ముగ్గురు ఏఈల తీరే వేరు..!
● ఇష్టానుసారంగా విధులు ● విద్యుత్‌శాఖ ఎంఆర్టీలో చోద్యం
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ శాఖలో కొంత మంది ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వేలల్లో వేతనాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు ఎ గనామం పెడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అ ధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.ఎంఆర్టీ విభాగంలో పనిచేసే ముగ్గురు ఏఈలు ఇష్టమొచ్చినప్పుడు రావడం, రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోవ డం పరిపాటిగా మారింది. మరో ఉద్యోగయితే ఏకంగా కార్యాలయంలో అడుగు పెట్టకుండానే వేతనాలు తీసుకోవడం గమనార్హం. వివిధ పను ల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారికి అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. విద్యుత్‌మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, సబ్‌స్టేష న్‌లోని బ్రేకర్లు, హె చ్‌డీ మీటర్లకు సంబంధించి చూడాల్సి ఉంటుంది. అయితే వీరికి సంబంధిత శాఖ అధికారుల అండదండలు ఉండడంతో ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహా న్‌ను వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.