గ్యారంటీలే కాంగ్రెస్‌ విజయానికి బాటలు.. | - | Sakshi
Sakshi News home page

గ్యారంటీలే కాంగ్రెస్‌ విజయానికి బాటలు..

Apr 16 2024 12:20 AM | Updated on Apr 16 2024 10:34 AM

- - Sakshi

మాట్లాడుతున్న అడ్డి భోజారెడ్డి

● డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి

ఆదిలాబాద్‌: గ్యారంటీలే కాంగ్రెస్‌ విజయానికి బా టలు వేస్తాయని డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందన్నారు.

దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ఎంపీ అభ్యర్థికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశముందన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు గుడిపెల్లి నగేష్‌, మంచికట్ల ఆశమ్మ, శ్రీ లేఖ, బండి దేవిదాస్‌, చారి, తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: వలసలు ఆగేదెలా?

Advertisement
 
Advertisement
Advertisement