పాత కక్షలతో వ్య‌క్తిని విచక్షణారహితంగా పొడిచి.. | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో వ్య‌క్తిని విచక్షణారహితంగా పొడిచి..

Published Sat, Dec 2 2023 1:46 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తిని కత్తితో దాడిచేసి హత్య చేసిన సంఘటన మండలంలోని కేస్లాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన బొడ్డు వెంకటి–లక్ష్మి దంపతుల మూడో కుమారుడు బొడ్డు జలేందర్‌(38) అదే గ్రామానికి చెందిన ముత్యం రాజశేఖర్‌గౌడ్‌ల మధ్య రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న రాజశేఖర్‌ శుక్రవారం రాత్రి భీమిని వైపు నుంచి కేస్లాపూర్‌కు వెళ్తున్న జలేందర్‌ను కేస్లాపూర్‌ గ్రామం పరిధిలోని హన్మాన్‌ ఆలయం వద్ద కత్తితో దాడికి పాల్పడ్డాడు.

విచక్షణరహిత్యంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా తెలిపారు. ఎస్సై ప్రశాంత్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ సదయ్య బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య శారద, ముగ్గురు కూతుళ్లు మేఘన, మేనక, రక్షిత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి చ‌ద‌వండి: ప్రియుడి ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. అంతా సహ ఉద్యోగులే

Advertisement
Advertisement