ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించిన గండ్రత్ సుజాత నిరాదరణకు గురయ్యారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ కంది శ్రీనివాసరెడ్డికి దక్కడంతో అసమ్మతి నేతలు సాజిద్‌ఖాన్, సంజీవ్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సంజీవ్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపిన అసమ్మతి వర్గం అతని గెలుపు కోసం విస్తృతంగా యత్నిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే బరిలో నిలిచిన సుజాతకు పరాజయం ఎదురైంది. ఈ ఎన్నికల్లో టిక్కెట్ రాలేదని వెనుకడుగు వేయకుండా స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించి విజయం కోసం ముందుకు సాగుతున్నారు.


