చిన్నారిని కుదిపేసిన కాలం! | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని కుదిపేసిన కాలం!

Nov 2 2023 5:12 AM | Updated on Nov 2 2023 7:23 AM

- - Sakshi

ఆరాధ్య (ఫైల్)

సాక్షి, ఆదిలాబాద్‌: మండల కేంద్రానికి చెందిన నరంశెట్టి ప్రకాష్‌, పల్లవి దంపతుల కూతరు ఆరాధ్య(ఎనిమిది నెలలు) ఫిట్స్‌తో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చిన్నారి ఆరాధ్య మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి ఫిట్స్‌ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు. కొంచెం నయం కావడంతో ఇంటికి తీసుకొచ్చారు. నిర్మల్‌లోని చిన్నపిల్లల వైద్యులకు చూపించేందుకు బుధవారం తీసుకువెళ్లారు. నిర్మల్‌ చేరుకోగానే మళ్లీ ఫిట్స్‌ వచ్చింది. వైద్యులకు చూపించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement