
విద్యార్థులతో మాట్లాడుతున్న కుమ్ర ఈశ్వరిబాయి
నార్నూర్: పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యం, మెనూపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూంను పరిశీలించారు. స్టోర్‌లో కూరగాయలు చెడిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. పోషకాహార లోపం వల్ల ఇలా జరిగిందని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌ను అదేశించారు. బాలికలకు సరిపడా వపతి గదులు లేదని, మరుగుదొడ్లు, నీటి సమస్య ఉందని విద్యార్థిని తమ దృష్టికి తీసుకువచ్చిందన్నారు. నూతన వసతి గృహం నిర్మాణంలో ఉన్నందున త్వరగా పూర్తి చేయించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌సీవో గంగాధర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. విద్యార్థిని ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీపీ కనక మోతుబాయి, మహిళా నాయకురాలు విద్యారాణి, ఉపాధ్యాయులు ఉన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి