breaking news
Yudhra
-
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు
దీపావళిని దేశవ్యాప్తంగా అందరూ గ్రాండ్‌గా జరుపుకొన్నారు. పండగ రోజే తెలుగు, డబ్బింగ్ మూవీస్ కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు వీకెండ్ వచ్చేసింది. ఇందుకు తగ్గట్లే ఓటీటీల్లోకి కూడా క్రేజీ మూవీస్ వచ్చేశాయి. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విశ్వం, కలి అనే తెలుగు చిత్రాలతో పాటు హిట్లర్, లబ్బర్ పందు అనే డబ్బింగ్ మూవీస్.. యుధ్రా అనే హిందీ చిత్రం ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'తంగలాన్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దీపావళికి రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పారు. కానీ ఇందులో కాకుండా ఆస్ట్రో మూవీస్ అనే మరో ఓటీటీలో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వచ్చింది. అది కూడా భారత్‌లో స్ట్రీమింగ్ కావట్లేదు.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (నవంబర్ 1st)అమెజాన్ ప్రైమ్విశ్వం - తెలుగు సినిమాసూరజ్ సూదేశ్ మూవీ - మలయాళ మూవీసత్తం ఎన్ కయిల్ - తమిళ సినిమాఇబ్బని తబ్బిడ ఇలయాలీ - కన్నడ మూవీబ్లాక్ - తమిళ సినిమాఫ్రీడమ్ - ఫ్రెంచ్ చిత్రంయుధ్రా - హిందీ సినిమా (రెంట్ విధానం)హిట్లర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)నెట్ఫ్లిక్స్లెట్ గో - స్వీడిష్ సినిమాఇట్స్ ఆల్ ఓవర్ - స్పానిష్ సినిమాబార్బీ మిస్టరీస్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ - ఇంగ్లీష్ సినిమాలబ్బర్ పందు - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఎక్స్‌ప్లోరర్: ఎండ్యురెన్స్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 3)ఆహాఅర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కలి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)జియో సినిమాదస్ జూన్ కి రాత్: చాప్టర్ 2 - హిందీ సిరీస్జీ5మిథ్య: ద డార్క్ చాప్టర్ - హిందీ సిరీస్ఆస్ట్రో మూవీస్తంగలాన్ - తమిళ మూవీఅంధగన్ - తమిళ సినిమా(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ) -
ఇంటిమేట్ సీన్.. అంత ఈజీ కాదు: మాళవిక మోహనన్
ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం అంత ఈజీ కాదు అంటుంది కేరళ బ్యూటీ మాళవికా మోహనన్. ఆమె నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘యుధ్రా’. ఇందులో ఆమె హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి పలు ఇంటిమేట్, కిస్ సీన్లలో నటించింది. ‘సాథియా’ అంటూ సాగే పాటలో బికినీలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ఇంటిమేట్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సీన్లలో నటించడం అంత సులభం కాదన్నారు.(చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్)‘ప్రతి సినిమాలోనూ ఇంటిమేట్ సీన్లను షూట్ చేసేటప్పుడు సెట్లో ఇంటిమేట్ కో-ఆర్డినేటర్ ఉంటారు. నటీనటులు ఇబ్బంది పడకుండా ఎలా యాక్ట్ చేయాలో వాళ్లు చెబుతుంటారు. అలా చేయడం మంచి పని. అయితే యుధ్రా సినిమాలో అలాంటి సీన్లు చిత్రీకరించే సయమంలో కో ఆర్డినేటర్ సెట్లో లేరు. (చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్)‘సాథియా’ సాంగ్ చిత్రీకరణ మాకు పెద్ద సవాలుగా మారింది. అందులో పలు రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. సముద్రం తీరంలో ఆ పాట చేయాలి. అక్కడ చలి ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాలేదు. మొదట్లో సిద్దాంత్, నేను కంగారుపడ్డాం. కానీ చలిని తట్టుకోలేక ఏదో ఒకరకంగా ఆ సీన్లను పూర్తి చేయాలనుకున్నాం. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాం. ఇంటిమేట్ సీన్స్ చేయడం చాలా కష్టం. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి’ అని మాళవిక చెప్పుకొచ్చింది. మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.